
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఉమాశ్రీ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు సందర్శించారు. వారు వసతి గృహంలోని వాటర్ ప్లాంట్, వంటగదిని పరిశీలించి పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, వర్షాకాల వ్యాధులపై అవగాహన కల్పించారు. బయటి తినుబండారాలు, మురికినీటి వల్ల వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు సూచించారు. డాక్టర్ రాజేష్ నేతృత్వంలో 32 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, నలుగురి రక్త నమూనాలు ల్యాబ్‌కి పంపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
