హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక నవ వధువు పూజిత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లిలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తో ఏప్రిల్ 16న పూజిత వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను వేధించడంతో, ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. వధువు కుటుంబం ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అత్తింటివారిపై కేసు నమోదు చేశారు.
