
అమరచింత:తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా సేవలందించిన సాయి చంద్ 2వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి అంకితంగా అమరచింత గ్రామంలో విగ్రహావిష్కరణ జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ కోసం జీవితం అర్పించిన సాయిచంద్ సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సాయిచంద్ సతీమణి రజిని సాయిచంద్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 29న అమరచింత గ్రామంలో సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
