
జూలూరుపాడు, మే 19 (జిందగీ 9 న్యూస్ రిపోర్టర్ : రాము నాయక్): స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయిన సిబ్బందిని సోమవారం జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళ కానిస్టేబుళ్లు శైలజ, సౌజన్యలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
విశేష సేవలందించిన వారిని గుర్తుచేసుకుంటూ ఎస్సై రవి మాట్లాడుతూ, “బదిలీ అయిన సిబ్బంది ఇకపై కొత్త స్టేషన్లలో కూడా నిబద్ధతతో పని చేసి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి,” అని సూచించారు. కార్యక్రమంలో ఇతర సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
