
అలంపూర్/ఎర్రవల్లి : గురువారం ఉదయం ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల ప్రకారం — అయిజ మండలం గురుదొడ్డి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి, తన భార్య తిమ్మమ్మ, కుమారుడు జగన్మోహన్ రెడ్డి తో కలిసి బైకుపై పెబ్బేరు మండలం గంగారం గ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, భూషణ్ రెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని హుటాహుటిన హైవే అంబులెన్స్ ద్వారా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని హైవే అంబులెన్స్ EMT వెంకటేష్ మరియు పైలెట్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
