
పెబ్బేరు, మే 14 (zindagi9news):వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందిస్తూ, సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,78,500 విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు.
పెబ్బేరు మండలానికి చెందిన 12 మంది హాస్పిటల్ బిల్లుల పరిహార నిమిత్తంగా తమ సమస్యలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు తక్షణమే స్పందించి సహాయనిధిని మంజూరు చేయించారు.
తాము అందుబాటులో లేని కారణంగా చెక్కుల పంపిణీ బాధ్యతను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏం. రాజేంద్రప్రసాద్ యాదవ్కు అప్పగించారు. ఆయన సౌజన్యంతో పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయంలో చెక్కులు బాధితులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపురం సహదేవుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు మన్యం, కోఆప్షన్ సభ్యులు ఎండి ముస్తాక్, సోషల్ మీడియా ప్రతినిధులు పాతపల్లి చంద్రశేఖర్, ఆనంద్ సాగర్, తిప్పాయపల్లి ఎల్లస్వామి నాయుడు, నవీన్ గౌడ్, బుణ్యాదిపురం విజయ్ గౌడు, విజయవర్ధన్ గౌడ్, బొట్టు శ్రీను, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఆరిప్ తదితరులు పాల్గొన్నారు.
