కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించిన ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి సిహెచ్.వి.ఎస్. జనార్దన రావు హాజరై మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ పామెల సత్పతి (ఐఏఎస్) మార్గదర్శనంలో విద్యార్థుల కోసం చేపడుతున్న అనేక విద్యా కార్యక్రమాలలో భాగంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ తరగతులు గొప్ప అవకాశమని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు సమాజంలో అగ్రగామిగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి వేణు మాట్లాడుతూ, “విద్యార్థులు అవకాశాలను సకాలంలో ఉపయోగించుకుంటే విజయాలు సాధించడం సులభం,” అని అన్నారు. ఒలంపియాడ్ సమన్వయకర్త అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థులు కొత్త విషయాలపై దృష్టి పెట్టి ఎల్లప్పుడూ ముందంజలో ఉండాలి,” అన్నారు.
తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “గత రెండు నెలలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రైవేట్ విద్యా ప్రమాణాలకు తగిన విధంగా శిక్షణ అందించడం జరుగుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది,” అని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
8వ తరగతిలో విజేతలు:
1వ స్థానం: డి. రాణా
2వ స్థానం: వి. అర్జున్
3వ స్థానం: బి. రాజేష్
9వ తరగతిలో విజేతలు:
1వ స్థానం: ఆర్. శివ సాయి
2వ స్థానం: టి. తేజేశ్వర్
3వ స్థానం: వి. సిరిచందన్
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
