రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న అవినీతి ఘటన కలకలం రేపుతోంది. సిరిసిల్లలో పని చేస్తున్న ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి రూ.50 లక్షల విలువైన బిల్లును మంజూరు చేసేందుకు ఆయన రూ.60 వేలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు, కరీంనగర్‌లోని ఇంజనీర్ నివాసంలో జరిగిన అక్రమ లావాదేవీ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, ఇంజనీర్ అరెస్ట్‌తో సంబంధిత శాఖలో ప్రకంపనలు రేపినట్టు సమాచారం.
