పెబ్బేరు, మే 7: పెబ్బేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం పౌరోహిత్యంగా జరిగింది. గత నెల 13న ఓటింగ్ పద్ధతిలో ఎన్నికైన సంఘం అధ్యక్షుడు దేవరశెట్టి మహేష్ నేతృత్వంలో నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్. రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడిగా ఇటుకూరి బుచ్చయ్య శెట్టి, ఉపాధ్యక్షులుగా డి. శంకర్, కె. విజయ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా బి. విజయభాస్కర్, ఇ. శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీలుగా జె. హరికృష్ణ, జి. ఎనివాసులు, బి. రవి, కోశాధికారిగా ఇ. విశ్వనాథం ప్రమాణం చేశారు. కమిటీ సభ్యులుగా సింహయ్య, సంబు రాఘవేందర్, సంబు శ్రీనివాసులు, నాగప్రసాద్, రాముని రాజు, చరణ్, బి. శ్రీనివాసులు, నాగరాజు, బాల్ శెట్టి, వెంకటేష్, బాలరాజులు బాధ్యతలు స్వీకరించారు.
అదేవిధంగా యువ విభాగంలో యూత్ అధ్యక్షుడిగా బి. రాజేంద్రప్రసాద్, జనరల్ సెక్రటరీగా పి. వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా భానుప్రకాష్, కె. నరేష్ కుమార్, అడిషనల్ సెక్రటరీలుగా శివకుమార్, కిశోర్, కె. శివ, జాయింట్ సెక్రటరీలుగా డి. శివచరణ్, డి. కార్తిక్, కోశాధికారిగా ఎల్. నరేష్, సభ్యులుగా ఎం. సాయివిక్రమ్, రవిప్రకాష్, సంతోష్ ప్రమాణం చేశారు.
అనంతరం అధ్యక్షుడు మహేష్, నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహిళలు, సంఘ ప్రముఖులు కూడా అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ అధ్యక్షుడు ఇటుకూరి బుచ్చయ్య, కోశాధికారి రమేష్, అడిషనల్ సెక్రటరీ, కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ బి. వెంకటేష్, మండల ఇన్చార్జి గుబ్బ సింహయ్య తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
