జమ్మికుంట, మే 7(zindagi9news) : ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
ఇల్లందకుంట మండలం నివాసి దార ఏల్లేష్ (23), ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం క్రమేపి ప్రేమగా మారింది. అయితే ఆ యువతి వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఎల్లేష్ మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం.
దీనివల్ల తీవ్ర మనోవేదనకు లోనైన ఎల్లేష్, జమ్మికుంట రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం, తన కుమారుడు ప్రేమ విషయంలో తీవ్రంగా బాధపడుతున్నాడని, ఆ కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు.
ఈ సంఘటనపై రామగుండం ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
