బిజిగిరి షరీఫ్, మే 1(zindagi9news) :అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బిజిగిరి షరీఫ్ గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలి సంఘం ఆధ్వర్యంగా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలి సంఘం సభ్యులు ఉత్సాహభరితంగా జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు రాచపల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షుడు కట్కూరి తిరుపతి నేతృత్వం వహించారు. అలాగే హమాలి సంఘానికి చెందిన కార్యవర్గ సభ్యులు, యూనియన్ కార్యకర్తలు, స్థానిక కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మే డేకు మహత్త్వాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణపై నాయకులు మాట్లాడుతూ, సంఘటిత పోరాటంతోనే కార్మిక వర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
– Zindagi9News
