పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల అగ్రస్థానం
అల్ఫోర్స్ విద్యా సంస్థలు మరోసారి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. పదో తరగతి 2025 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ అల్ఫోర్స్ విద్యార్థులు అగ్రగాములుగా నిలిచారు.
ఈ సందర్భంగా అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందిన విద్యార్థుల గణనీయ విజయాన్ని పురస్కరించుకుని వావిలాలపల్లి వద్ద ఉన్న అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేయబడింది.
ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ – “పరీక్ష ఏదైనా, ఫలితం ఏదైనా… అగ్రస్థానం అల్ఫోర్స్దే అనేది మళ్లీ నిరూపితమైంది” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రారంభంలోనే ప్రణాళికలు, సూచనలు ఇవ్వడం, వాటిని కఠినంగా అమలు చేయడం వల్లే ఈ గొప్ప విజయాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు:
బి. సాత్విక్ – 589,
ఎ. విష్ణుప్రియ, కె. శివరాణి – 588,
కె. ఐశ్వర్య – 587,
ఎన్. సాత్విక్, ఎ. అన్విత్ – 586,
వి. అక్షర, జి. సహస్ర, సిహెచ్ ఆశ్రయ, టి. చరన్ కుమార్ – 585,
జి. శ్రీమేదా, వి. శివచరణ్, పి. గణేశ్, యన్. మధుశాలిని, కె. వినయ్ – 584,
ఎన్. నేహా, టి. నిత్య, జి. అఖిలా రెడ్డి, కె. ప్రణయ్, పి. అఖిల్ రావు – 583,
జి. సహజ – 582,
డీ. విశ్వతేజ్, కె. శోభన, కె. ఆలియా, యం. హర్షి, జి. ఐశ్వర్య, టి. కిషోర్ – 581,
యం. శృతకీర్తి, యం.డి. ముఖీత్, అర్. మౌనిమా, కె. సహస్ర రెడ్డి, వి. బృహతి, ఎ. రంజిత్ రెడ్డి, కె. సుకృతి – 580
సంస్థ మొత్తానికి గణాంకాలు:
మొత్తం విద్యార్థులు: 1140
500కి పైగా మార్కులు సాధించినవారు: 861
580కి పైగా: 35 మంది
570కి పైగా: 110 మంది
550కి పైగా: 341 మంది
ఈ విజయానికి మూలంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు డా. నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతమైన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు, స్కోరు కార్డులు అందజేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, టీచింగ్ & నాన్-టీచింగ్ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
