కరీంనగర్ : అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి, స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హై స్కూల్లో నూతనంగా నియమింపబడిన యన్.సి.సి. కల్నల్ అధికారి ఎ.కె. జయంతను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థుల్లో దేశభక్తిని రెట్టింపు ఉత్సాహంతో పెంపొందించాల్సిన అవసరం ఉందని, దేశ రక్షణ కోసం విద్యార్థులు అన్ని వేళలా సిద్ధంగా ఉండేలా తయారు కావాలన్నారు. ఈ విధంగా సమాజ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
కల్నల్ ఎ.కె. జయంత మాట్లాడుతూ, అల్ఫోర్స్ పాఠశాలలో యన్.సి.సి.కి సంబంధించిన ప్రణాళికలు చక్కగా రూపొందించి, సమయానికి అమలు చేస్తున్నారని అభినందించాడు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశ రక్షణకు సంబంధించిన అవగాహనను పెంపొందించడంలో పాఠశాల పాత్రను ప్రశంసించాడు.
నరేందర్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణ అందుతోందని, ఇది సమాజ హితానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు, జయంతను పూల మొక్క అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, యన్.సి.సి. అధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
