హైదరాబాద్, ఏప్రిల్ 27:
తెలంగాణలో నూతన లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమం రాజ్భవన్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యాడు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి లోకాయుక్తగా, జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ ఉప లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, మహమ్మద్ అలీ షబ్బీర్, వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
