టేకుమట్ల మండలంలో ధరణి స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి ROR – 2025 చట్టంపై రైతులకు, రైతు సంఘాలకు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు 2025 ఏప్రిల్ 24వ తేదీ, మధ్యాహ్నం 2.00 గంటలకు PRMR ఫంక్షన్ హాల్, టేకుమట్ల మండలంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇట్టి చట్టంపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు టేకుమట్ల మండల తహశీల్దార్ K. విజయలక్ష్మి తెలియజేశారు.
మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల రైతులు, రైతు సంఘాలు మరియు ప్రజాప్రతినిధులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
