పెబ్బేరు: పెబ్బేరు మున్సిపల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో పెరిగిన నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
వేసవి కాలం నేపథ్యంలో 4వ, 7వ, 8వ, 10వ, 12వ వార్డుల్లో తాగునీటి కొరత తీవ్రంగా నెలకొన్నది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎల్ల స్వామి, రణధీర్ రెడ్డి, పెద్ద రాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
