వేములవాడ, ఏప్రిల్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు, అనుపురం గ్రామానికి చెందిన పొత్తూరు శ్రీహరి, సిల్వరి పరశురాం నాంపల్లి నుండి తాళ్లు గీసుకొని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా, రోడ్ దాటే సమయంలో కరీంనగర్ నుండి వేములవాడ వైపు వస్తున్న బ్రీజా కారు (TS 09 ER 7099) బైకును వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పొత్తూరు శ్రీహరి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారింది. సిల్వరి పరశురాం కు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
