విశాఖపట్నం, 14 ఏప్రిల్ 2025(శంకర్-Zindagi9News ప్రతినిధి) :
ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం, అనుమానాలు పెరిగి దారుణ హత్యకు దారి తీశారు ఓ భర్త. ఈ దారుణ ఘటన విశాఖపట్నం నగరంలో సంచలనం రేపింది.
దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్, అడ్డరోడ్డుకు చెందిన అనూషతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం వీరిద్దరూ మధురవాడలో నివాసం ఉండేవారు. ఇటీవల జ్ఞానేశ్వర్ మరొక మహిళతో సంబంధం ఉన్నట్లు అనూష గమనించడంతో, వారి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి.
ఈ క్రమంలో ఎనిమిది నెలల గర్భిణి అయిన అనూషతో తలెత్తిన వాగ్వాదం సమయంలో, జ్ఞానేశ్వర్ ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం భార్య ఆరోగ్యంగా లేకపోయిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే అనూషను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో జ్ఞానేశ్వర్ హత్య చేసినట్టు అంగీకరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.జి.హెచ్ ఆసుపత్రికి తరలించారు.
– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
