హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో, డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం జీవో తొలి ప్రతిని అందజేసింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, పోరిక బలరాం నాయక్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఈ నిర్ణయం ద్వారా ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పోరాటానికి ఒక దశగా భావిస్తున్నారు.
