కొత్తపల్లి (హెచ్), కరీంనగర్, ఏప్రిల్ 12:అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు జోనల్ స్థాయి అంతర్జాతీయ సాంఘిక శాస్త్ర ఒలంపియాడ్లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ పోటీలో పాఠశాల విద్యార్థులు నాలుగు పతకాలను గెలుచుకుని ప్రఖ్యాతిని పొందారు.6వ తరగతి విద్యార్థి బొంగోని కార్తికేయ, 8వ తరగతి విద్యార్థులు హరి శ్రీహరిణి (బంగారు పతకం), యం. విఘ్నేష్ చంద్ర (రజత పతకం), మరియు 9వ తరగతి విద్యార్థి యం. హిమేశ్ చంద్ర (బంగారు పతకం) విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా స్కూల్లో నిర్వహించిన ప్రశంసా సభలో చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “సాంఘిక శాస్త్రం విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెంపొందించడమే కాదు, వారు సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించేలా చేస్తుంది. అల్ఫోర్స్ విద్యాసంస్థలు విద్యార్థులలో సామాజిక స్పష్టతను, పోటీ పరీక్షల కోసం అవసరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయి” అని తెలిపారు.విజేతల ప్రోత్సాహార్థంగా పుష్పగుచ్ఛాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
