శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గోపాల్ నగరం గ్రామస్తులు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గోపాల్ నగరం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని పెద్దలు, యువత, ప్రజలంతా కలిసి ఊరేగింపుగా శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపు గ్రామ వీధుల గుండా సాగింది. పల్లకిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఊరేగించగా, గ్రామస్తులు పూలు చల్లి స్వాగతం పలికారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు గ్రామ యువత విశేషంగా కృషి చేశారు. సమష్టిగా నిర్వహించిన ఈ పండుగ వేడుకలు గ్రామంలో సాంప్రదాయ భక్తి భావాలను మరింత విస్తరించాయి
