ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించి మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పాలకవర్గ కమిటీ ఏర్పాటు అయింది. ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రామాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం “అపర భద్రాద్రి”గా ఖ్యాతి పొందింది. బ్రహ్మోత్సవాలను మునుపే కమిటీ ఏర్పాటు జరగడం ద్వారా భక్తుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పందిస్తూ, దేవస్థానం అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అని తెలిపారు.
కమిటీలో ఇంగిలి రామారావును ఆలయ చైర్మన్గా నియమించగా, మొత్తం 14 మంది డైరక్టర్లు సభ్యులుగా నియమితులయ్యారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
