శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహణ..
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు
సప్తగిరి కాలనీలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం శోభాయమానంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. పరిపూర్ణ పాలనకు నిలువెత్తు ఉదాహరణ. స్వామివారి పూజలు చేసినా, విన్నా, ప్రచారం చేసినా సకల రంగాలలో విజయాన్ని పొందవచ్చు. లోక కళ్యాణార్థమే ఆయన అవతరించాడని, ఆయన అనుగ్రహం పొందినవారు అష్టైశ్వర్యాలతో కుడి కడతారని” చెప్పారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాదీ ఈ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించామని తెలిపారు. “ప్రతి ఒక్కరూ రామ నామాన్ని జపిస్తూ, ధర్మాన్ని ఆచరించాలి. సమాజ అభివృద్ధికి పాటుపడాలి” అని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
