బంగారు పతకం సాధించిన ఇ. సుహాన్, రజత పతకం సాధించిన ఇ. లిఖిత్ కుమార్
కొత్తపల్లి: జోనల్ స్థాయి ఇన్ఫర్మేటిక్స్ ఒలంపియాడ్లో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. 8వ తరగతి విద్యార్థి ఇ. సుహాన్ బంగారు పతకం, ఇ. లిఖిత్ కుమార్ రజత పతకం సాధించగా, వారు త్వరలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను అభినందించారు. నేటి పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని, ఇలాంటి ఒలంపియాడ్ల ద్వారా విద్యార్థులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
“ఇన్ఫర్మేటిక్స్ అధ్యయనం సృజనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక దృక్పథం, త్వరిత నిర్ణయ సామర్థ్యం పెంచుతుందని” డా. నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే కృత్రిమ మేధస్సు వంటి విషయాలను బోధించడం సమాజ పురోగతికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
విజేతలకు పుష్పగుచ్ఛాలు, అర్హత పత్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
