టేకుమట్ల, మార్చి 21 (జిందగీ నైన్ న్యూస్ ప్రతినిధి):భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి తదితర గ్రామాల ప్రజలు అవసరాల నిమిత్తం జమ్మికుంట పట్టణానికి వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించాలి అనే విజ్ఞప్తితో వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన తూడి మల్లారెడ్డి హుజురాబాద్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ విషయంపై డిపో మేనేజర్ వెంటనే స్పందించి, శుక్రవారం నుంచి హుజురాబాద్ డిపో బస్సును జమ్మికుంట – ఓడేడు – వెంకట్రావుపల్లి మార్గంలో నడపాలని నిర్ణయించారు.
ఈ మేరకు:
➡️ ఉదయం 9 గంటలకు బస్సు జమ్మికుంట నుండి ఓడేడు వయా వెంకట్రావుపల్లికు రానుంది.
➡️ సాయంత్రం 6 గంటలకు బస్సు వెంకట్రావుపల్లి వయా ఓడేడు – జమ్మికుంటకు బయలుదేరనుంది.
ఈ కొత్త బస్సు సౌకర్యాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
బస్సు సౌకర్యం అందించిన హుజురాబాద్ డిపో అధికారులకు సన్మానం
బస్సు సౌకర్యం కల్పించినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నేరెళ్ల ఓం నారాయణ గౌడ్ నేతృత్వంలో బస్సు డ్రైవర్ స్వామి, కండక్టర్ సదయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అంతేగాక, తూడి మల్లారెడ్డి, డిపో మేనేజర్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త బస్సు సౌకర్యం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
