జిందగీ9 న్యూస్, మార్చి 13 (హనుమకొండ జిల్లా ప్రతినిధి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ను కలుసుకుని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఎమ్మెల్యే, శాయంపేట, వడ్డేపల్లి ప్రాంతాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు, అలాగే కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ (KUC) పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు ట్రాఫిక్ స్టేషన్ అవసరమని, వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరిన్ని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
