తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, మహిళా సాధికారత, హెచ్ఎండీఏ విస్తరణ, టూరిజం పాలసీ, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై కీలక తీర్మానాలు చేశారు.
42% రిజర్వేషన్లకు మంత్రివర్గ ఆమోదం
బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా & ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది.
ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు రాకుండా శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ
తెలంగాణ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (#FCDA) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ ఫ్యూచర్ సిటీలో 7 మండలాలు, 56 గ్రామాలు ఉంటాయి.
హెచ్ఎండీఏ పరిధి విస్తరణ
హెచ్ఎండీఏ పరిధిని ఆర్ఆర్ఆర్ అవతల 2 కిమీ వరకు విస్తరించనున్నారు. 11 జిల్లాల్లో 104 మండలాల్లోని 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.
మహిళా సాధికారత – “ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025”
🔹గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలను ఒకే గొడుగు కింద తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.
🔹సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసు 15 ఏళ్లకు తగ్గింపు
🔹గరిష్ట వయసు 65 ఏళ్లకు పెంపు
యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కొత్త టూరిజం పాలసీ (2025-2030)
తెలంగాణలో 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, 15,000 కోట్ల పెట్టుబడులు రాబట్టేలా టూరిజం విధానం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మిస్ వరల్డ్ – 2025 & పారా ఒలింపిక్స్ విజేతకు ఉద్యోగం
మే 2025లో హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల అతిథులు హాజరుకానుండగా, వారికి అత్యుత్తమ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
2024 పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి ప్రభుత్వ ఉద్యోగం మంజూరు.
రెవెన్యూ గ్రామాల అభివృద్ధి
🔸10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియామకం
🔸పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపు
🔸361 కొత్త రెవెన్యూ పోస్టుల భర్తీకి అనుమతి
✅గురుకులాల్లో 330 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం
✅గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్య తగ్గింపు
✅గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMC నుంచి 1.28 TMCకి తగ్గించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
✅లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ నేత కె. జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
➡️ ఈ నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
