తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే కోసం ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చింది. ఈరోజుతో (28వ తేదీ) సర్వే గడువు ముగుస్తోంది.
పాల్గొనని వారు వెంటనే ఎన్యుమరేటర్లకు వివరాలు అందించాలి. మీ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం ఉండాలంటే, కుల గణన సర్వేలో పాల్గొనాలి.
సర్వేలో పాల్గొనాల్సిన విధానాలు:
✅ ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు.
✅ ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేక కౌంటర్లలో నమోదు చేసుకోవచ్చు.
✅ ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలంటే: seeepcsurvey.cgg.gov.in
✅ ఇంకా వివరాలకు టోల్ ఫ్రీ నంబర్: 040-211 11111
అర్హత గలవారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కుల గణన కీలకం
కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు ఇంకా పాల్గొనని వారికి అవగాహన కల్పించాలి. ఈరోజే సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత అందరిది.
తెలంగాణ ప్రజలంతా కుల గణనలో భాగస్వామ్యం కావాలి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
