కరీంనగర్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు. కరీంనగర్ మంకమ్మ తోట ధన్ ఘర్ వాడి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు ఆయనకు మద్దతుగా అక్కడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు విజయం ఎవరిదో తేలుస్తారు. ప్రజాస్వామ్య విలువలను రక్షించేలా, సమస్యలకు పరిష్కారం చూపేలా మా పోరాటం కొనసాగుతుంది” అని అన్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
