మహా శివరాత్రి: ఉపవాసం & జాగరణ
మహా శివరాత్రి ప్రత్యేక సందర్భంలో ఉపవాసం, జాగరణ నియమాలను పాటించడం శివుని కృపకు పాత్రులయ్యే సాధనంగా భావించబడుతుంది.
✅ ఉపవాస నియమాలు ✅
🔹 సంపూర్ణ ఆరోగ్యవంతులైనవారే ఉపవాసం చేయాలి.
🔹 కఠిన ఉపవాసం (నీరు కూడా తీసుకోకపోవడం) అనుసరించకూడదు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా పాలు, పళ్ల రసాలు తీసుకోవచ్చు.
🔹 మధుమేహం, రక్తపోటు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు & కాలేయ వ్యాధులున్నవారు ఉపవాసం చేయరాదు.
🔹 పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉపవాసం చేయకూడదు.
🔹 అశౌచంలో ఉన్నవారికి ఉపవాసం తప్పనిసరి కాదు.
🔹 ఉపవాస విరమణ తర్వాత పూర్తి సాత్వికాహారం తీసుకోవాలి.
🙏 జాగరణ పరమార్ధం 🌙
🔱 వేదాంతం ప్రకారం, రాత్రిని అజ్ఞానంతో పోలుస్తారు. శివరాత్రి సందర్భంగా జాగరణ ద్వారా ఆత్మావలోకనం చేసుకుంటే దీని నిజమైన ఉద్దేశం నెరవేరుతుంది.
✅ జాగరణ జాగ్రత్తలు ✅
🔹 ఆరోగ్యంగా ఉన్నవారే మాత్రమే జాగరణ చేయాలి.
🔹 మరుసటి రోజు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.
🔹 నిద్రలేమితో తలనొప్పి, కళ్లు ఉబ్బడం, ఏకాగ్రత లోపం, మానసిక కుంగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ ఇలాంటి సమస్యలు ఉంటే జాగరణ మానేయాలి.
🔹 వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండి శివధ్యానంలో మనసును స్థిరంగా ఉంచాలి.
🙏 శివోహం శివోహం శివోహం 🙏
