నారాయణపేట: ఫిర్యాదుదారుడిపై నమోదైన కేసులో తీవ్రతను తగ్గించేందుకు రూ.40,000 లంచం డిమాండ్ చేసి, అందులో రూ.20,000 తీసుకుంటుండగా మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుండెమోని చంద్ర శేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనలో ఆయనతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు – సింగసాని శివ, కుర్వ నర్సింహులు కూడా భాగస్వాములైనట్టు తేలింది.
వివరాల్లోకి వెళితే, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయంలో కేసు తీవ్రతను తగ్గించేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుండెమోని చంద్ర శేఖర్ లంచం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఫిర్యాదుదారుని వద్ద నుంచి రూ.40,000 డిమాండ్ చేయగా, ప్రాథమికంగా రూ.20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనలో మక్తల్ సీఐ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా పాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిపై అక్రమ లంచం, అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
.
