వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామ భాగస్వామ్య పరిశీలన
బోయినిపల్లి ఫిబ్రవరి 18;రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో సిరిసిల్ల ప్రభుత్వ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎండి పర్వీన్, రంగు వర్ష, ఎండి సల్మాని, మాలోతు తేజస్విని, నవ్య శ్రీ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్య పరిశీలన అంచన వేశారు. పరిశీలనలో భాగంగా గ్రామంలో తిరిగి వివిధ వనరులను, సమస్యలను, అభివృద్ధి పనులను గమనించి మంగళవారం గ్రామ పంచాయితి ఆవరణలో చిత్రపటాల రూపంలో అభివృద్ధి పనులు, గ్రామంలో కల వనరులు, సమస్యలు గ్రామ రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ మాజీ సర్పంచ్ చిందం రమేష్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, కావు సంఘం అధ్యక్షులు బుర్ర రాజు, రెడ్డి సంఘం అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, మాజి వార్డు సభ్యులు మిల్కుల శ్రీనివాస్, అభ్యుదయ రైతులు అమిదాల లక్ష్మరెడ్డి, ముదాం కమలాకర్, అమిదాల రాజిరెడ్డి, చేపూరి మహేష్, శిలం శ్రీనివాస్ రెడ్డి, గోగురి చెంద్రారెడ్డి, తడగొండ రాజేష్, గుడి లక్ష్మారెడ్డి, సారబుడ్ల నరసింహారెడ్డి, మిరియాల సాకేత్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
