టేకుమట్ల: టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన పెండల రాములు అకాలమరణం చెందడంతో, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం నింపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, టేకుమట్ల మాజీ ఎంపీటీసీ ఆది సునీత రఘు, నెరెళ్ల రామకృష్ణ గౌడ్, రేణిగుంట్ల సమ్మయ్య, ఎర్ర సమ్మయ్య, మదనయ్య, రాయమల్లు, బక్కయ్య, రవీందర్, రాజమల్లు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పెండల శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ తరఫున నాయకులు సంతాపం తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
