హుజురాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సుదర్శన హోమం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయపూర్వకంగా నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
“తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నేతృత్వం అవసరం”
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ:
“తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానేత కేసీఆర్ ఆశయాలు సుసంపన్నం కావాలి. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేరువ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్.
“తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యం” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
