మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం
జమ్మికుంట: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అరుణోదయ మండల సమాఖ్య కార్యాలయంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి పాల్గొని, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలపై వివరణ ఇచ్చారు.
హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి” అని సూచించారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం & గురువారం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్యాంశాలు:
✔ పోషకాహారం & రక్తహీనత నివారణ: మహిళలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని హెల్త్ ఎడ్యూకేటర్లు వివరించారు.
✔ వ్యక్తిగత పరిశుభ్రత: చేతుల పరిశుభ్రత, శుభ్రమైన తినుబండారాలు & నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
✔ టీబీ వ్యాధి జాగ్రత్తలు: టీబీ సూపర్ వైజర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘టీబీ ముక్త్’ ప్రోగ్రాం కింద టీబీ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్స్ రత్నకుమారి, దేవేందర్ రెడ్డి, తిరుపతి, అలాగే మండల సమాఖ్య అధ్యక్షురాలు శృతి, కార్యదర్శి రజిత, కోశాధికారి భవాని & పలువురు గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
