భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ.50 నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.50 నోట్లపై మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంది. అయితే, ఆయన పదవీ విరమణ అనంతరం కొత్త గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా పేరుతో తాజా నోట్ల ముద్రణ చేపట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఈ కొత్త నోట్ల డిజైన్, రంగు, సైజు, థీమ్ – మహాత్మా గాంధీ సిరీస్లో ఇప్పటికే ఉన్న రూ.50 నోట్ల మాదిరిగానే ఉండనుంది. ఇకపోతే, ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.50 నోట్లు కూడా చట్టబద్ధంగానే కొనసాగుతాయని, ప్రజలు వాటిని వాడుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
