హైదరాబాద్: బంజారాల ఆరాధ్యదైవం మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి అధికారికంగా ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 15న జరగనున్న ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు గిరిజన నేతలు తెలిపారు.
