కులగణనలో పాల్గొనని కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు దానిపై మాట్లాడే అర్హత లేదు..
కుల గణన పై వారు ప్రస్తావించడం క్షమించరాని నేరం కింద లెక్కే..
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ :కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ నివేదికను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఈరోజు సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజు అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం మీడియాతో వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడుతూ
అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భాగంగా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే -2024 నివేదికను ఇవాళ శాసనసభలో సీఎం రేవంత్, మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టడం హర్షనీయమని పేర్కొన్నారు. 4 ఫిబ్రవరి, 2024 కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
సర్వేలో 3.54 కోట్ల కుటుంబాలు పాల్గొన్నాయని, 75 అంశాల ప్రాతిపదికగా సర్వే జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సర్వే నిర్వహించడం రికార్డు అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 నవంబర్, 2024న ప్రారంభమైన సర్వే 25 డిసెంబర్, 2024 వరకు 50 రోజుల పాటు కొనసాగడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సరిగ్గా ఏడాదిలోపు ఈ నిర్ణయం నివేదికగా మారి సభముందుకు వచ్చిందని, ఇది ఓ చరిత్రాత్మక సందర్భం అని పేర్కొన్నారు. సర్వే తయారీలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలతో పాటు కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని, ఇది ఆషామాషీగా చేసిన సర్వే కాదని పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుందని తెలిపారు.
కులగణన సమగ్ర సర్వేలో పాల్గొనని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కులగణన పై మాట్లాడే అర్హత లేదని రాజేందర్ రావ్ మండిపడ్డారు. సమగ్ర సర్వే వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు మస్తుండడంతో వారు జీర్ణించుకో లేకపోతున్నారని విమర్శించారు. సమగ్ర సర్వే గురించి వారికి ప్రస్తావించే అర్హత కూడా లేదని సూచించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం టికెట్లు అందిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
