టేకుమట్ల, ఫిబ్రవరి 01 : తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడిగా ఉడుత రాయకొమురును, కార్యదర్శిగా పోతనవేణి కుమారును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ తెలిపారు. శనివారం ఆయన మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో మండల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ..జిల్లాలోకి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
