జమ్మికుంట రూరల్, జనవరి 28: తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 న వేస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది జనవరి 25వ తారీకు ఆదివారం ఆరోజు బ్యాంకులకు సెలవు మీరు 26వ తారీకు రైతుల అకౌంట్లో రైతు భరోసా జమ అవుతాయని చెప్పిన రేవంత్ రెడ్డి వట్టి మాటలు గాని మిగిలిపోయాయి అని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు బండారి ప్రశాంత్ మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. అలాగే రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తానని చెప్పితివి,రైతులకు 15వేల రూపాయలు రైతు భరోసా వేస్తానని చెప్పితివి,
రైతులకు బోనస్ ఎక్కడ పాయె
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . రాష్ట్రంలో మీరు రైతులను మోసం చేయాలని పనిగా పెట్టుకున్నారు కానీ మీరు రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర రైతాంగం గమనిస్తోంది దీనికి తగిన గునపాఠం నీకు రాబోయే రోజుల్లో చెప్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా నిలిచిపోతుందని అని అన్నారు.
