టేకుమట్ల మండలంలోని నాయి బ్రాహ్మణ అందరికీ ప్రజా పాలన లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నాయి బ్రాహ్మణ గౌరవ అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ గౌడ్, మండల అధ్యక్షులు మేడిపెల్లి నరేష్ నాయి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల్లో నాయి బ్రాహ్మణ కులస్తులకు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు, రేషన్ కార్డు లేనివారికి నూతన రేషన్ కార్డు , కూలి పని వెళ్లే వారికి జాబ్ కార్డు, రేషన్ కార్డులో పేరు లేని పిల్లలను నమోదు చేయడం కోసం గ్రామసభల్లో నాయి బ్రహ్మణ కులానికి ప్రతేక్య స్థానం ఇవ్వాలని అర్హులైన అందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కులము అగ్రవర్ణ కులము బీసీలలో తన వెనుకబడిన కులము కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు గుర్తింపు చేసి వారికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మండల నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.
