టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలు ఇప్పటికే అమలు చేశామని అన్నారు . సభ ముఖ్య ఉద్దేశం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నిరుపేదలకు పారదర్శకంగా ప్రజలకు అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సభలు ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దాసారపు సదానందం గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా పొలాలకు వెళ్లి రహదారికి పది లక్షల రూపాయలు, గ్రామ పంచాయితీ భవనానికి 25 లక్షల రూపాయలు, కలుకోట ఎస్సీ కాలనీ కొత్తపల్లి వాడలకు అదనపు విద్యుత్తు లైన్లో కోసం ఐదు లక్షల తొమ్మిది వేల రూపాయలు తక్షణ సహాయంగా సభాముఖంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సీలింగ్ భూముల్లో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తానని సభాముఖంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటంకూరి రాం నరసింహారెడ్డి, మండలాధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి తిరుమల లచ్చిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు మోతే రాజమౌళి ,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాంపల్లి వీరేశం, వివో సెల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబెల్లి విజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనుమరుగుల సంపత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు తోడేటి కుమార్, మాజీ ఉపసర్పంచ్ పుప్పాల రాజు, మద్దెల కుమార్, పచ్చిక దిలీప్ రెడ్డి ,నల్లబెల్లి మొండయ్య ,దాసరపు మల్లేష్ ,నాగుల నరేందర్ ,గోపగాని సదయ్య, జిల్లా నాయకులు కత్తి సంపత్ గౌడ్ ,దొంతుల శ్రీనివాస్, మండల నాయకులు చింతలపల్లి స్వామి రావు ,కూర వెంకట్రాజిరెడ్డి ,కోయడ చిరంజీవి, సొ రుపాక సదానందం, యూత్ అధ్యక్షులు యాళ్ల నరేష్, కాని గంటి మహేందర్ ,యాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
