పెద్దపల్లి పట్టణం తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ JAC, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం
పెద్దపల్లి విద్యుత్ సూపర్ ఇండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ ను వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న పెద్దపల్లి నియోజకవర్గం బి ఆర్ ఎస్ నాయకురాలు దాసరి ఉష .ఈ సందర్భం గా ఉష మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ఆర్టీజన్స్ నీ వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒకే సంస్థలో ఆర్టిజన్లను ఒక్కరకంగా ఉద్యోగస్తులకు ఒక్క రకంగా చేస్తున్నారంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆర్టీజన్లో యొక్క విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరారు .ఇది నిన్న మొన్నటి సమస్య కాదు గత 18 సంవత్సరాలుగా ఆర్టిజన్స్ గా వ్యవహరిస్తున్న వారికి రెగ్యులరైజ్ చేయక పోయేసరికి వారికి సమాన గౌరవం కూడదక్కడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతున్నాయి వారు మరణిస్తే వారి పిల్లలకు చదువుకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది
అదే ఆర్టిజన్లకు సమానమైన పని చేస్తున్నారు గాని వారికి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు కనీసం రిటైర్మెంట్ అయినప్పుడు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభించడం లేదు వీళ్ళందరికీ తగినటువంటి బెనిఫిట్స్ రావాలని రెగ్యులరైజ్ వెంటనే చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు .

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
