ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తాజాగా ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్‌ను విడుదల చేసింది. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 7 జనవరి 2025
ముగింపు తేది: 27 జనవరి 2025
సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
[3d-flip-book id=”1763″ ][/3d-flip-book]
విద్యార్హత: అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఎంపీసీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్, డిప్లొమా సబ్జెక్టుల్లో మార్కులతో పాటు ఇంగ్లీష్‌లో కూడా 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 50శాతం మార్కులు సాధించిన వారు కూడా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము : రూ. 500 లు
అభ్యర్థులు 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు అన్ని దశల్లో ఎంపిక పూర్తి చేసుకున్నా గరిష్ట వయసు 21ఏళ్లకు మించకూడదు.
అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థులు మాత్రమే అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. నాలుగేళ్ల పరిమిత సర్వీస్ కావడంతో ఆ సమయంలో పెళ్లి చేసుకోడానికి అనుమతించరు. నాలుగేళ్ల వ్యవధిలోపు పెళ్లి చేసుకుంటే వారిని సర్వీస్ నుంచి తొలగిస్తారు. అగ్నివీర్ సర్వీస్ నుంచి రెగ్యులర్ సర్వీసుల్లోకి నియామకం జరిగే నాటికి అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. మహిళా అభ్యర్థులు నాలుగేళ్ల సర్వీస్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను గర్భం దాల్చడానికి అనుమతించరు.సర్వీస్ సమయంలో గర్భం దాల్చిన వారిని సర్వీసుల నుంచి తొలగిస్తారు. రెగ్యులర్ సర్వీసుల్లోకి కూడా అనుమతించరు. నియామక సమయంలోనే అభ్యర్థులు ఈ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది.
వేతనం: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ.40వేల వరకు జీతం ఉంటుంది.
వెబ్ సైట్ : https://agnipathvayu.cdac.in/AV/
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
