
కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ డిప్యూటీ తహసీల్దార్ ను ఎసిబి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు కలకుంట్ల నవీన్ రావు తనకు ఉన్న రెండు గుంటలు వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం డిప్యూటీ తహసీల్దార్ పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా 6000 రూపాయలు ముందుగా ఒప్పందం కుదిరింది. దీంతో నవీన్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.6 వేలు డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి సోదరి భూమిలో సర్వే నిర్వహించి అధికారికంగా సర్వే నివేదికను సమర్పించేందుకు గాను ఫిర్యాధుదారుని నుండి రూ.50,000/- లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం డిప్యూటీ సర్వేయర్ మెరుగు రత్నం .
